బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (17:26 IST)

భారత్‌‍ను ఓడిస్తే.. బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తా : పాకిస్థాన్ నటి

Sehar Shinwari
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, ఈ నెల 14వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఇందులో పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని పాకిస్థాన్ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు, ఆ దేశ సినీ రాజకీయ ప్రముఖులతోపాటు ప్రజలు కూడా ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మరో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను బంగ్లాదేశ్ కుర్రోళ్లు ఓడించాలని, అలా చేస్తే బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేటింగ్‌కు వెళతానని పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి వెల్లడించారు. ఈ ప్రకటనను ఆమె భారత్, పాక్‌ మ్యాచ్‌ జరిగిన మరుసటి రోజు చేసింది. కానీ, ఆ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. 
 
'భగవంతుడా.. టీమ్‌ఇండియాను బంగ్లాదేశ్ ఓడిస్తే ఢాకాకు వెళ్లి ఆ దేశ క్రికెటర్‌తో డిన్నర్‌ డేట్‌కు వెళ్తా' అని సెహర్ షిన్వారి తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్టు చేసింది. ఈ నటి గతంలో వివాదస్పద పోస్ట్‌లు చేసింది. ఈ ఏడాది ఆసియా కప్‌లో సూపర్‌-4 మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అప్పుడు పాక్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌, జట్టు సభ్యులపై కేసు పెడతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పాక్‌ ఆటగాళ్లు ప్రతిసారి క్రికెట్‌ ఆడటానికి బదులు దేశ ప్రజల ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నారని ఆరోపించింది.
 
సంచలన పోస్ట్ చేసి ఈ నటి ఎవరబ్బా అంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. పాక్‌లోని సింధు ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో ఈమె జన్మించారు. షిన్వారి తెగకు చెందిన ఈమె నటిగా రాణిస్తోంది. సెహరి నటన వైపు వెళ్తానంటే తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా పట్టువిడవకుండా తన కలను సాకారం చేసుకుంది. 2014లో కామెడీ సీరియల్ 'సైర్ సావా సైర్‌' ద్వారా అరంగేట్రం చేసింది.