శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మే 2023 (21:08 IST)

భూమి అందాలను వీక్షిస్తూ.. 100,000 అడుగుల ఎత్తులో పెళ్లి?!

Space Marriage
Space Marriage
పెళ్లి చేసుకునే సంప్రదాయం ఇప్పుడు అనేక హద్దులు దాటిపోయింది. వివాహ వేదిక నుండి ప్రారంభించి, బట్టలు, ఉపకరణాల నుండి ఆహారం వరకు ప్రతిదానికీ చాలా ఎంపికలు ఉన్నాయి. ఎక్సోటిక్ లొకేషన్స్‌లో పెళ్లి చేసుకోవడం, సుందరమైన ప్రాంతాల్లో దండలు మార్చుకోవడం వంటి సంఘటనలు ప్రస్తుత ట్రెండ్‌. 
 
ఈ క్రమంలోనే ఎవరైనా ఊహించని విధంగా అంతరిక్షంలో పెళ్లి చేసుకునే సదుపాయాన్ని అందించేందుకు ఓ ప్రైవేట్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ విధంగా అంతరిక్షంలో పెళ్లి చేసుకునేందుకు రూ. 1 కోటి ఫీజుగా నిర్ణయించారు.
 
స్పేస్ పెర్స్పెక్టివ్ అనే కొత్త కంపెనీ పెళ్లయిన జంటలను కార్బన్ న్యూట్రల్ బెలూన్లలో అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ జెయింట్ బెలూన్‌కి చాలా కిటికీలు ఉన్నాయి. భూమి నుండి బయలుదేరిన జంట అంతరిక్షంలో ఉన్నట్లుగా భూమి అందాలను వీక్షిస్తూ సరిగ్గా 100,000 అడుగుల ఎత్తులో వివాహం చేసుకోవచ్చు. 
 
వివాహానంతరం వారు తిరిగి వివాహిత జంటగా భూమిపైకి తీసుకువస్తారు. ఈ విధంగా అంతరిక్షంలో పెళ్లి చేసుకోవడానికి ఇప్పటికే వేలాది మంది బుక్ చేసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ తరహా మ్యారేజ్ సర్వీస్‌ను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.