శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (18:42 IST)

రూ.35వేల కోట్ల డబ్బు.. అన్‌క్లెయిమ్డ్ అకౌంట్లకు పంపిణీ

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.35వేల కోట్ల రూపాయల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఇప్పుడు వేలాది కోట్లు వున్నాయి. 
 
ఈ డబ్బులు తమవంటూ క్లెయిమ్ చేసేవాళ్లు లేకపోవడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఈ మొత్తం ఆర్బీఐకి చేరింది. దీనిని అన్‌క్లెయిన్ ఎక్కౌంట్స్ అంటారు. 
 
ఇలా దేశ వ్యాప్తంగా రూ.35వేల కోట్లు ఆర్బీఐకి చేరాయి. ఇప్పుడీ డబ్బుల్ని సంబంధిత కుటుంబీకుల్ని గుర్తించి వారి ఖాతాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ఆర్ధిక శాఖ తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 
 
దేశంలోని ప్రతి ఒక్క జిల్లాలో అన్‌క్లెయిమ్డ్ టాప్ 100 ఎక్కౌంట్లను సరిచేసేందుకు 100 రోజుల కార్యక్రమం జూన్ 2023 నుంచి జరుగనుంది. దీనిని బట్టి వచ్చే వంద రోజుల్లో 35 వేల కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బులు సంబంధిత కుటుంబ సభ్యులకు చేరనుంది.