గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మే 2023 (11:07 IST)

శర్వానంద్ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యిందా?

Sharvanand
Sharvanand
టాలీవుడ్ నటుడు శర్వానంద్ నిశ్చితార్థం క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. జనవరిలో రక్షిత రెడ్డితో జరిగిన నిశ్చితార్థాన్ని శర్వానంద్ రద్దు చేసుకున్నట్లు రూమర్సు వస్తున్నాయి. 
 
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, అదితి రావ్ హైదరీ, అఖిల్ అక్కినేని వంటి ప్రముఖులతో సహా సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరైనారు. ఆ తర్వాత అప్పటి నుంచి పెళ్లి గురించి ఎలాంటి వార్తలు రాకపోవడంతో క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి. శర్వానంద్ బృందం ఈ పుకార్లపై స్పందించింది.
 
పెళ్లికి ఇంకా సమయం వుందని ధృవీకరించారు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్యతో తన రాబోయే చిత్రం షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నాడు. అతను లండన్‌లో 40 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. ఇటీవలే భారత్ వచ్చాయి. ఈ సందర్భంగా పెళ్లి తేదీని నిర్ణయించడానికి తన కుటుంబ సభ్యులను కలవాలని ప్లాన్ చేశాడు. దీనిపై అధికారిక ప్రకటన రానుంది.