సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (12:43 IST)

స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్‌ను కౌగిలించుకున్న బాలుడు.. వీడియో వైరల్

Afganistan
Afganistan
ఇంగ్లండ్‌పై ఆప్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌పై ఆఫ్ఘనిస్థాన్‌ ఘనవిజయం సాధించాక ఓ బాలుడు సంతోషం తట్టుకోలేక స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్‌ను కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. 
 
ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారింది. ఇదంతా చూసిన నెటిజన్లు ఆ బాలుడు ఆఫ్ఘన్ కుర్రాడేనని భావించారు. ఇంగ్లండ్‌పై విజయం సాధించాక బాలుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడని అనుకున్నారు. కానీ ఆ బాలుడిది భారత్ ‌అని తాజాగా ముజీబ్ చెప్పాడు.  
 
"ఇంగ్లండ్‌పై ఆఫ్ఘనిస్థాన్ గెలిచిన తరువాత కన్నీళ్లు పెట్టుకున్న బాలుడిది మా దేశం కాదు. అతడు భారత్ కుర్రాడే. క్రికెట్ అంటే కేవలం ఆట కాదు భావోద్వేగమని ఈ చిన్నారి తెలియజేశాడు’’ అని ముజీబ్ చెప్పాడు.