శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: మంగళవారం, 31 జులై 2018 (20:48 IST)

భార్య పోయిందని కుమార్తెపై లైంగిక దాడి చేసిన కామాంధుడు...

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నబిడ్డపై తండ్రి పైశాచికానికి పాల్పడ్డాడు. బంధాలు, అనుబంధాలు, రక్తసంబంధాలు అన్నీ మాయమవుతున్నాయి. కన్నవాళ్ళలో కొంతమంది కామంతో చూస్తున్నారనడానికి ఈ దారుణం నిదర్శనం.

10వ తరగతి బాలికపై తండ్రే ఘాతుకానికి పాల్పడ్డాడు. రెండేళ్ళుగా కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇస్నాపూర్‌లో నివసించే సుబ్బారావు కుమార్తె మంజుల. తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి కూలి పనిచేస్తూ కుమార్తెను చూసుకునేవాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా చిన్నారిపై తండ్రి అఘాయిత్యం చేస్తున్నాడు. 
 
విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. కానీ విద్యార్థిని ధైర్యం చేసి తను చదువుతున్న పాఠశాల హెడ్ మాస్టర్‌కు అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు హెడ్ మాస్టర్. చిన్నారిని చైల్డ్ లైన్ అధికారులకు అప్పగించగడంతో వారు ఆమెను రెస్కూ హోంకు తరలించారు.