శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 31 జులై 2018 (16:58 IST)

ఆమె కోసమే గెట్ టు గెదర్ పార్టీ... రేప్ చేసి వీడియో తీశాడు... ఆ తర్వాత?

కాలేజీకి వెళుతున్న కొందరు అమ్మాయిలను కామచూపు చూసే కొందరు యువకులు ట్రాప్ చేసి వాళ్ల జీవితాలను పాడు చేస్తున్న సంఘటనలను మనం చూస్తూనే వున్నాం. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా 17 ఏళ్ల బాలికపై ఓ కామాంధ యువకుడు చేసిన

కాలేజీకి వెళుతున్న కొందరు అమ్మాయిలను కామచూపు చూసే కొందరు యువకులు ట్రాప్ చేసి వాళ్ల జీవితాలను పాడు చేస్తున్న సంఘటనలను మనం చూస్తూనే వున్నాం. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా 17 ఏళ్ల బాలికపై ఓ కామాంధ యువకుడు చేసిన దారుణంతో ఆమె జీవితం ఏమైందో చూడండి.
 
మహారాష్ట్రలోని పుణెలోని ఓ కాలేజీలో 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఆమె చాలా అందగత్తె. ఆమెపై కన్నేశాడు సీనియర్ విద్యార్థి. ఆమెను ఎలాగైనా లైంగికంగా లొంగదీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో తన ఇంట్లో గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి జూనియర్, సీనియర్ విద్యార్థినీవిద్యార్థులను అందరినీ పిలిచాడు. అందరితో పాటు అతడు కన్నేసిన విద్యార్థిని కూడా వచ్చింది. దీనితో అతడు ఆమెకు మాత్రం మత్తు వున్న కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆమె మెల్లగా క్రమంగా మత్తులోకి జారుకుంది. దాంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ దారుణాన్ని వీడియోలో బంధించాడు. 
 
బాధిత యువతికి మెళకువ రాగానే తను చేసిన పైశాచిక క్రీడను ఆమెకు చూపించి, తన లైంగిక కోర్కె తీర్చకపోతే అవి బయటపెడతానంటూ బెదిరించి అలా నాలుగు నెలలపాటు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు నెట్లో అప్ చేస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. హాస్టల్లో చదువుకుంటున్న ఆ యువతి అతడికి భయపడి వ్యవహారాన్ని దాచిపెట్టింది. ఐతే అతడి కారణంగా ఆమె గర్భవతి అయి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు షాక్ తిన్నారు. జరిగిన ఉదంతాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.