గన్ గురిపెట్టి రికార్డ్ డాన్సర్లపై అత్యాచారం.. ఎక్కడ?
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. పొట్టకూటితోపాటు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించే నిమిత్తం రికార్డు డాన్సులతో పాటు వీధి నాటకాలు వేసుకునే ఐదుగురు మహిళలను కొందరు కామాంధులు అత్యాచారం చేశారు.
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. పొట్టకూటితోపాటు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించే నిమిత్తం రికార్డు డాన్సులతో పాటు వీధి నాటకాలు వేసుకునే ఐదుగురు మహిళలను కొందరు కామాంధులు అత్యాచారం చేశారు. ఆ మహిళలను బలవంతంగా ఓ గదిలో బంధించి, తలకు తుపాకీ గురిపెట్టిమరీ అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
జార్ఖండ్ రాష్ట్రంలోని ఎర్కీలోని కోచాంగ్‌లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా 11 మంది సభ్యులతో కూడిన బృందం వీధి నాటకాన్ని ప్రదర్శిస్తుంది. ఆ సమయంలో సాయుధాలతో కూడిన అంగతకులు అక్కడి వచ్చి ఈ బృందంలోని పురుషులను కొట్టి, మహిళలను దూరంగా తీసుకెళ్ళి, గన్ గురిపెట్టి అత్యాచారం చేశారు. ఈ కేసులో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు మహిళల అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది.