మంగళసూత్రం ఇలా వేసుకుంటే వందేళ్ళు సౌభాగ్యం...
మన దేశంలో వివాహాలు చేసుకునే హిందువులు మంగళసూత్రాన్ని భార్యకు కడతారు. ఇది ఎంతో పవిత్రమైన సూత్రం. కొంతమంది మంగళసూత్రంపైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దిచడం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారుచేసుకుంటారు. అసలు ఇల
మన దేశంలో వివాహాలు చేసుకునే హిందువులు మంగళసూత్రాన్ని భార్యకు కడతారు. ఇది ఎంతో పవిత్రమైన సూత్రం. కొంతమంది మంగళసూత్రంపైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దిచడం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారుచేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకువచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మగాని, రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయట.
కొంతమందికి వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళంటే ఇష్టం. ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారుచేసి వేయించుకుంటుంటారు. అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళ సూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని ప్లైన్‌గా వేసుకోవడం మంచిది.