1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. god puja's for daily religion

ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి... ఫలితం ఏంటి?

నిత్యం తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహిస్తుండే భక్తులలో కొంతమంది ఏడు వారాలలో ఒక్కొక్క దేవునికి మెుక్కుకుంటూ ఉంటారు. ఇలా ఏడు రోజులపాటు పూజలు చేస్తే శివుని కరుణాకటాక్షాలు లభిస్తాయన్నది శాస్త్రవచనం. ఆ పూజా

God
నిత్యం తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహిస్తుండే భక్తులలో కొంతమంది ఏడు వారాలలో ఒక్కొక్క దేవునికి మెుక్కుకుంటూ ఉంటారు. ఇలా ఏడు రోజులపాటు పూజలు చేస్తే శివుని కరుణాకటాక్షాలు లభిస్తాయన్నది శాస్త్రవచనం. ఆ పూజా విధానాన్ని అనుసరించి...
 
ఆదివారం: సూర్యభగవానుని పూజించాలి. ఈ నాడు సూర్యుని ఆరాధించడం వలన తలనొప్పులు, కంటిజబ్బులు నయమవుతాయి. కుష్ఠురోగం తగ్గుముఖం పడుతుంది.
 
సోమవారం:  లక్ష్మీదేవిని పూజిస్తే సంపదవృద్ధి జరుగుతుంది.
 
మంగళవారం: కాళికామాతను పూజిస్తే రోగాల నుండి బయటపడవచ్చును.
 
బుధవారం : విష్ణుపూజ చేయాలి. ఈ రోజున విష్ణుపూజ చేయడం వలన బంధుమిత్రులకు మంచి జరుగుతుంది.
 
గురువారం : ఈ రోజున సాయిబాబాను పూజించాలి. ఇష్టదేవతను పూజింకోవచ్చును. తమ ఇష్టదేవతలను పూజించుకున్న వారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది.
 
శుక్రవారం : ఈ రోజున ఇష్టదేవతాపూజ చేయడంవలన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యసిద్ధి.
 
శనివారం : ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చును. రుద్రాదిదేవతలను పూజించుకున్నవారికి ప్రమాదాలనుంచి రక్షణతో పాటు దీర్ఘాయుష్షు కలుగుతుంది. 
 
ఈ విధంగా ఆయా వారాలలో ఆయా దేవతల పూజలను చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
మంగళవారం ''మహాకాళి'' అమ్మవారిని పూజిస్తే...