సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (11:35 IST)

లక్ష్మీదేవిని పూజిస్తే... శుక్రగ్రహ దోషాలు...

జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారాలు వేరే కావచ్చు. మరికొన్ని సమస్యలకు అవసరాలకు డబ్బే ప్రధానం. ధనానికి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, దారిద్ర్యంతో కష్టాలు బాధపడేవారు శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజిస్తే మంచ

జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారాలు వేరే కావచ్చు. మరికొన్ని సమస్యలకు అవసరాలకు డబ్బే ప్రధానం. ధనానికి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, దారిద్ర్యంతో కష్టాలు బాధపడేవారు శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజిస్తే మంచిది.
 
ఆ తల్లి అంకితభావంతో కూడిన పూజాభిషేకాలు జరపవలసి ఉంటుంది. శుక్రవారం రోజున భక్తిశ్రద్ధలతో సేవించవలసి ఉంటుంది. అందువలన అమ్మవారు ప్రీతిచెందుతుందనీ ఫలితంగా దారిద్ర్యం తొలగిపోయ సంపదలు ప్రసాదించబడతాయని పురోహితులు అంటున్నారు. అంతేకాకుండా అమ్మవారిని అర్చించడం వలన శుక్ర గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
 
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికాకపోవడం, అవమానాలు ఎదురుకావడం, అనారోగ్యం వంటివి శుక్రగ్రహ దోషంతో ఏర్పడుతాయి. అందుచేత శుక్రగ్రహ దోషాలను తొలగించుకోవడానికి లక్ష్మీపూజ తప్పనిసరి అని పండితులు తెలియజేశారు. శుక్రవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారి ఆలయంలో ప్రదక్షణలు చేయడం వలన పూజాభిషేకాలు జరపించడం వలన ఆశించిన ఫలితం లభిస్తుంది.