శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (17:20 IST)

హైహీల్స్ చొప్పులు వేసుకుంటున్నారా... అయితే ఈ విషయాలు మీ కోసం...

ప్రస్తుత కాలంలో యువతులు ఆధునిక ట్రెండ్‌‍కు అనుగుణంగా హైహీల్స్ ధరించేందుకు అమితాసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కాస్తంత ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలు అయితే హైహీల్సే వేసేందుకు ఇష్టపడుతారు. అయితే హైహీల్స్ వ

ప్రస్తుత కాలంలో యువతులు ఆధునిక ట్రెండ్‌‍కు అనుగుణంగా హైహీల్స్ ధరించేందుకు అమితాసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కాస్తంత ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలు అయితే హైహీల్సే వేసేందుకు ఇష్టపడుతారు. అయితే హైహీల్స్ వేసుకోవడం వలన అందంగా కనిపించడం కంటే అనారోగ్య సమస్యల బారిన పడుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
హైహీల్స్‌ వేసుకోవడం వల్ల కాళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. హీల్‌ సైజ్‌ పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా నిలబడక పోవడం వలన కండరాలపై అధికంగా ఒత్తిడి పడుతుంది. ఒక అంగుళం ఉన్న హీల్‌ వలన 22 శాతం, రెండు అంగుళాల హీల్‌ వలన 57 శాతం, మూడు అంగుళాల హీల్‌ వలన 76శాతం అధిక భారం పాదాలపై పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
అలాగే నడుము క్రిందిభాగంలో ఒత్తిడిపడి కొంచెం వెనక్కి వంగిపోయి ఛాతీభాగం ముందుకు వస్తుంది. అందువల్ల స్పాండిలైటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. కాళ్లకు పాదాలకు మధ్య రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల నరాలు బలహీనంగా మారి అనేక సమస్యలు వస్తాయి. మోకాళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌ వస్తుంది.