1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
  4. Women's special... orange peel benefits

కమలా ఫలం తొక్కులతో ఎన్ని ప్రయోజనాలో...

కమలా పండ్లు వేసవిలోనే ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు ఆరగించడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని తొక్కులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

women
కమలా పండ్లు వేసవిలోనే ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు ఆరగించడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని తొక్కులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
 
ఒక్కోసారి ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలా ఫ్రిజ్ నుండి దుర్వాసన వచ్చినపుడు ఎండబెట్టిన కమలా తొక్కుల పొడిని రెండు చెంచాలు తీసుకుని అందులో కాస్త ఉప్పును కలిపి ఓ పాత్రలో కలుపుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేయండ ఫ్రిజ్‌లో నుండి వచ్చే దుర్వాసనను, తేమనూ పీల్చుకుంటంది ఈ కమలా పొడి. కమలా పొడి లేకపోతే తాజా కమలాపండును ఉంచితే కూడా మంచిది.
 
నిమ్మజాతి ఫలాల్లో లెమొనేన్‌ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది దోమల్ని, ఈగల్ని దూరం చేస్తే శక్తిని కలిగిఉంటుంది. ముఖ్యంగా ఈ రసాయన పదార్థం కమలా ఫలంలో 90 శాతం మేరకు ఉంటుంది. అందువల్ల దోమలూ, ఈగల బెడద ఉన్నచోట ఈ కమలా తొక్కలను ఉంచుకుంటే మంచిది.
 
రంధ్రాలున్న ఓ డబ్బాలో కొన్ని కమలా ఫలం తొక్కలు వేసి దుస్తుల అల్మారాలో ఉంచితే సువాసనలు వస్తాయి. స్వీట్ల తయారీలో ఉపయోగించే బ్రౌన్‌ షుగర్‌ త్వరగా గడ్డ కట్టకుండా ఉండేందుకు ఈ కమలా తొక్క ఎంతగానో దోహదపడుతుంది. తేమను త్వరగా పీల్చే గుణం ఈ తొక్కల్లో అధికంగా ఉంటుంది. 
 
ఇకపోతే ఒక సీసాలో రెండు కమలాపండ్ల తొక్కులని వేసి అవి మునిగేంతవరకూ వెనిగర్‌ వేయాలి. ఆ సీసాను వారం పదిరోజులు అలానే వదిలేయాలి. తరువాత ఆ తొక్కులని తొలగించి మిగిలిన వెనిగర్‌ని స్ప్రే సీసాలో తీసుకుంటే చెక్క ఫర్నిచర్‌, ఫ్రిజ్‌, ఓవెన్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వస్తువులు తుడవడానికి చాలా ఉపయోగపడుతుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
పిల్లలకు వెన్నను తినిపిస్తే... నాడి వ్యవస్థకు...