బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (16:39 IST)

ఆభరణాలను ఎలా శుభ్రం చేస్తున్నారు?

ఆభరణాలను ఫంక్షన్లకు అందంగా అలంకరించుకెళ్లడం ఒక కళైతే, ఆభరణాలను వన్నె తగ్గకుండా ఉపయోగించడం కూడా మరో కళే. ప్రతి రోజూ వేసుకునే ఆభరణాలను వారానికి రెండు సార్లు, ఎప్పుడో ఒకప్పుడు వేసుకునే నగల్ని వేసి తీసిన

ఆభరణాలను ఫంక్షన్లకు అందంగా అలంకరించుకెళ్లడం ఒక కళైతే, ఆభరణాలను వన్నె తగ్గకుండా ఉపయోగించడం కూడా మరో కళే. ప్రతి రోజూ వేసుకునే ఆభరణాలను వారానికి రెండు సార్లు, ఎప్పుడో ఒకప్పుడు వేసుకునే నగల్ని వేసి తీసిన తరువాత శుభ్రపరచకోవడం వంటివి చేయాలి.
 
ఇంగా ఆభరణాల తయారీకి మృదువైన బ్రష్‌ను ఉపయోగించాలి. బ్రష్‌తో ఆభరణాలను శుభ్రం చేయడానికి ముందుగా వాటిని 10 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టుకుంటే బ్రష్ రుద్దుకునేటప్పుడు ఆభరణాలు మృదువుగా తయారవుతాయి. ముఖ్యంగా ఐబ్రో బ్రష్, హెయిర్ డై బ్రష్‌లను ఆభరణాల శుభ్రతకు ఉపయోగించకూడదు. 
 
ఆభరణాన్ని బ్రష్‌తో రుద్దుతున్నప్పుడు గోరువెచ్చని నీటిని పోస్తూ రబ్ చేస్తూ ఉంటే మురికి తొలగిపోతుంది. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఉండదు. అయితే ఆభరణాలను అన్నింటినీ ఒకేసారి కాకుండా విడి విడిగా శుభ్రచేసుకుంటే మంచిది.
 
రత్నాలు పొదిగి ఉండే ఆభరణాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచకూడదు. అటువంటి ఆభరణాలను సబ్బు నీటిలో ముంచి వెంటనే తీయాలి. గోరువెచ్చని నీటిని పోస్తూ మృదువుగా రుద్దాలి. తర్వాత మెత్తని వస్త్రంతో తడి లేకుండా తుడవాలి. ఆభరణం వెనుకవైపు కూడా తడి లేకుండా తుడిచి భద్రపరచాలి. ఇలా ఆభరణాలు శుభ్రం చేసుకుంటే అవి కొత్తవిగా చాలా అందంగా కనిపిస్తాయి.