బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (13:39 IST)

షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారా... అందుకు వేపపొడిని తీసుకుంటే...

వేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వేపలోని ఆరోగ్య గుణాలు అనారోగ్య సమస్యలను పరిష్కరించుటలో చాలా ఉపయోగపడుతుంది. వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప

వేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వేపలోని ఆరోగ్య గుణాలు అనారోగ్య సమస్యలను పరిష్కరించుటలో చాలా ఉపయోగపడుతుంది. వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప చర్మ ఆరోగ్యానికి కూడా అద్భుత ఫలితాలను అందిస్తుంది. వీటన్నింటి కన్నా వేప పొడిలో ఎన్నో ఉపయోగాలున్నాయి. అవెంటో తెలుసుకుందాం.
 
వేప పొడిని పళ్లు తోముడానికి ఉపయోగిస్తే చిగుళ్ళను, పగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. నోటిలోని బాక్టీరియాలను నాశనం చేసి కావిటీలను నివారించి మంచి శ్వాసను అందిస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు స్పూన్ వేపపొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మంచిది.
 
ఇలా ప్రతిరోజు వేపపొడిని తీసుకుంటే షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసేందుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేప పొడిని ముక్కులో డ్రాప్స్‌లా ఉపయోగిస్తే సైనస్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. ఈ వేప పొడి రక్తాన్ని శుభ్రం చేసేందుకు చాలా సహాయపడుతుంది. కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వంటి వాటిని నివారించుటలో వేపపొడి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.