శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ivr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (14:37 IST)

చెన్నైలో దారుణం... ఏడో తరగతి విద్యార్థినిపై 22 మంది అత్యాచారం

కామాంధులకు కన్నుమిన్నూ కానరావడంలేదనే దానికి మరో నిదర్శనం. తమిళనాడు చెన్నై మహానగరంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై 22 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన వెలుగుచూసింది. ఆమెపై సెక్యూరి

కామాంధులకు కన్నుమిన్నూ కానరావడంలేదనే దానికి మరో నిదర్శనం. తమిళనాడు చెన్నై మహానగరంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై 22 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన వెలుగుచూసింది. ఆమెపై సెక్యూరిటీ గార్డులు మొదలుకొని లిఫ్ట్ బోయ్స్, ప్లంబర్ సహా అపార్టుమెంట్లో పనిచేసేవారు మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికకు వినికిడి సమస్య వుండటంతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కామాంధులు ఈ దారుణానికి తెగబడ్డారు. 
 
ఆమెకు కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి అత్యాచారం చేసినట్లు తేలింది. రేప్ చేసిన సమయంలో వీడియో తీసి, ఆమె స్పృహలోకి వచ్చాక ఆ వీడియోలను చూపిస్తూ, విషయాన్ని ఎవరికైనా చెబితే అవన్నీ బయటపెడతామంటూ గత కొన్ని నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. నిందితుల్లో 20 ఏళ్ల యువకుడి నుంచి 66 ఏళ్ల వృద్ధుడి వరకూ వున్నారు. తొలుత తనపై వృద్ధుడే అత్యాచారం చేసాడని ఆ బాలిక వెల్లడించింది. 
 
చెన్నైలోని అయనవరం పెట్రోలు బంకుకు సమీపంలో వున్న ఈ అపార్టుమెంట్ నిర్వహణపై గతంలోనూ చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ వీటిపై పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ దారుణం జరిగింది. కాగా ఇప్పటివరకూ 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు కోసం గాలిస్తున్నారు.