సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (10:05 IST)

మద్యం తాగించి విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై ప్రసవం... ఎక్కడ?

మహారాష్ట్రలోని పూణెలో కాలేజీ విద్యార్థిని ప్రసవించింది. అదీ కూడా 17 యేళ్ల ప్రాయంలోనే ఆ విద్యార్థిని ఓ బిడ్డకు తల్లి అయింది. మద్యం తాపించి అత్యాచారం చేయడంతో ఆ విద్యార్థిని గర్భందాల్చింది. ఫలితంగా ఓ బిడ

మహారాష్ట్రలోని పూణెలో కాలేజీ విద్యార్థిని ప్రసవించింది. అదీ కూడా 17 యేళ్ల ప్రాయంలోనే ఆ విద్యార్థిని ఓ బిడ్డకు తల్లి అయింది. మద్యం తాపించి అత్యాచారం చేయడంతో ఆ విద్యార్థిని గర్భందాల్చింది. ఫలితంగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
పూణె, ఎరవాడలోని ఓ ప్రముఖ కళాశాలలో ఓ బాలిక 11వ తరగతి చదువుతోంది. గత యేడాది డిసెంబరు నెలలో బాలిక కళాశాల స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. విహార యాత్ర నుంచి విద్యార్థులు తిరిగి వెళ్లిపోగా ఏదో పని ఉండగా ఆమె ఉండిపోయింది. దీంతో ఆమె సహ విద్యార్థి అయిన ఓ యువకుడు బాలికతో మద్యం తాపించాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
మూడు నెలల తర్వాత గతంలో అత్యాచారం చేసిన వీడియో తన వద్ద ఉందని దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తానని బెదిరిస్తూ సహ విద్యార్థి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భందాల్చింది. అయితే, ఆ బాలికకు కడుపు నొప్పితోపాటు రక్తస్రావమైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తేగానీ విషయం బయటపడలేదు. 
 
ఆస్పత్రిలో నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ పిల్ల క్షేమంగా ఉన్నారని, శిశువు గురించి ఏం చేయాలనేది తాము నిర్ణయం తీసుకుంటామని బాధిత బాలిక తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు నిందితుడైన బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన బాలల సదనానికి తరలించారు.