1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. GHMC Election Results : N Uttam Kumar Reddy To Resign As TPCC Chief

బల్దియా పోరులో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఓటర్లు.. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రిజైన్

GHMC Election Results
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. మొత్తం 150 డివిజన్లకుగాను కేవలం రెండంటే రెండు సీట్లలోనే కాంగ్రెస్ అభ్యర్థులు విజయంసాధించారు. అంటే.. ఈ బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
 
ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదివికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రభావం చూపలేక పోయింది. 
 
ఈ ఎన్నికల్లో  ఆ పార్టీ మూడో స్థానానికి దిగజారగా, బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించారు. ఇది తెరాసకు కూడా మింగుడు పడలేదు. కానీ, జీహెచ్ఎంసీ ఓటర్లు మాత్రం మరోమారు తెరాసకే పట్టంకట్టారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలంగాణలో భాజపాకి ఊపిరులూదిన కేసీఆర్, ఇక నాగార్జున సాగర్ భయం...