1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Governor Tamilsai Soundararajan Security persons ignorance

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం

Governor
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం రాజేంద్రనగర్‌లోని ఎన్ఐఆర్‌డీకి సదస్సుకు గవర్నర్ హాజరు అయిన సందర్భంగా ఈ పరిణామం జరిగింది. యూనిసెఫ్ ఆధ్వర్యంలో  శానిటేషన్, హైజీన్ కాంక్లేవ్ సదస్సులో ఆమె ప్రసంగించారు. 
 
అయితే గవర్నర్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తాళం ఉంచి, తలుపులు మూసి బయటకు సిబ్బంది రావడంతో వాహనానికి ఆటోమెటిక్ లాక్ పడింది. ఈ కారణంగా కారు తలుపులు తీయడానికి రాలేదు. దీంతో డోర్ తీసేందుకు భద్రతా సిబ్బంది తంటాలు పడాల్సి వచ్చింది. సిబ్బంది వ్యవహరించిన తీరుపై గవర్నర్ భద్రతా సిబ్బంది మండిపడ్డారు.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
స్పీకర్ తమ్మినేని ఎందుకలా చేస్తున్నారు.. ఏమైందంటే?