సంబంధిత వార్తలు
- హేమంత్ కేసు.. ఇద్దరు అరెస్ట్.. బంగారు గొలుసు, ఉంగరం స్వాధీనం..
- దయచేసి బయటకు రావొద్దు .. కిషన్ రెడ్డి :: ఓయూ పరీక్షలు వాయిదా
- హైదరాబాద్‌లో అర్థరాత్రి ఘోరం.. గోడకూలి 9 మంది మృతి
- బల్దియాలో రికార్డులన్నీ బద్దలు... అత్యవసర సేవల కోసం ఫోన్ నంబర్లు ఇవే...
- నీట మునిగిన భాగ్యనగరం .. కుండపోత వర్షంతో అస్తవ్యస్తం
కొలిక్కివచ్చిన హేమంత్ హత్య కేసు.. ఇక ఫాస్ట్ కోర్టులో విచారణ!!
ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన హేమంత్ హత్య కేసు వ్యవహారం ఓ కొలిక్కివచ్చింది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులను విడతలవారీగా కష్టడీలోకి తీసుకుని విచారించారు. వీరు వెల్లడించిన విషయాలతో పాటు పోలీసులు కూడా కీలకమైన ఆధారాలు సేకరించారు. దీంతో ఈ కేసులో నిందితుల వద్ద పోలీసుల విచారణ పూర్తయింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాగనుంది. అలాగే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో చార్జిషీటును కూడా పక్షం రోజుల లోపు దాఖలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, ఇంటీరియల్ డిజైనర్‌గా పని చేస్తూ వచ్చిన హేమంత్ అనే యువకుడు రెడ్డి కులానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఈ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ప్రేమించిన యువతిని హేమంత్ ప్రేమపెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అవంతి తల్లిదండ్రులు, బంధువులు, కిరాయి హంతకులతో హత్య చేయించారు. ఈ కేసులోని నిందితుల్లో అవంతి తల్లిదండ్రులు, మేనమాన కీలక సూత్రధారులుగా ఉన్నారు.
