1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. High alert in those affected districts

ఆ ప్రభావిత జిల్లాల్లో హైఅలర్ట్

High alert
శనివారం తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ పటిష్టం చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ఏరియాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన బలగాలు.. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఆ ప్రాంతాలను వారి గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేకాకుండా అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టి ఉంచారు. అలాగే సీఐ, ఎస్పై, సీఆర్‌పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయా గ్రామస్తులను కోరారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
వైఎస్ వివేకా హత్య కేసు : రంగంలోకి దిగిన సీబీఐ టెక్నికల్ టీమ్ - సీన్ రీకన్‌స్ట్రక్షన్