సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (06:32 IST)

ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలో హైఅలర్ట్

ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్ధితిని సమీక్షిస్తున్నామని.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం సూచించిందని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీ జితేందర్ తెలిపారు.
 
అవసరమైతే అదనపు బలగాలను మోహరించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అటు సైబరాబాద్‌లోనూ హైఅలర్ట్ ప్రకటించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
 
కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని.. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని సజ్జనార్ వెల్లడించారు.
 
ఇక రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోనూ అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంచనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.