శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (23:21 IST)

ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభలో ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. కాశ్మీర్ లో ఈ పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆయన ఆరోపించారు.
 
సోమవారం నాడు ఆర్టికల్ 370 రద్దుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి ప్రసంగించారు.  ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. రెండు జాతీయ పతాకాలు ఉండడంపై కూడ ఆయన మాట్లాడారు.
 
భారత జాతీయ పతాకాన్ని దగ్దం చేయడం  జమ్మూలో నేరం ఎందుకు కాదని ఆయన ప్రశ్నించారు. ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు ఉంటారా ఇది ఎక్కడ ఉండదన్నారు. 1947 నుండి  జమ్మూకాశ్మీర్ ప్రజలు ఈ విషయమై పోరాటం చేస్తున్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.
 
370 ఆర్టికల్ రద్దు చేసి కేంద్రం మంచి నిర్ణయం తీసుకొందని  విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
 
కాశ్మీర్ సమస్యకు మోడీ సర్కార్ మంచి పరిష్కారాన్ని చూపారని  ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ, అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారని విజయసాయిరెడ్డి ప్రకటించారు.  370 ఆర్టికల్ రద్దు చేయాలని  నిర్ణయం తీసుకొన్న మోడీకి  విజయసాయి రెడ్డి హ్యాట్సాప్ చెప్పారు.