శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (23:13 IST)

దేశానికి ఆదర్శంగా తెలంగాణ... ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి వారి సౌజన్యం తో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరిశ్ రావు మాట్లాడుతూ...
 
" చింత మడక నుండే ఆరోగ్య సూచిక నాంది. పసి పిల్ల నుండి పండు ముసలి వరకు గ్రామంలో ప్రతి మనిషికి అన్ని ఆరోగ్య పరిక్షలు చేస్తారు. సియం కేసీఆర్ ఆలోచనతో చింతమడకలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సియం కేసీఆర్, యశోద ఆస్పత్రి వారి కృషితో ఉచిత ఆరోగ్య సూచిక ఏర్పాటు చేశాము.

ఇక్కడ ప్రతిరోజు 500మందికి ఆరోగ్య పరీక్షలు జరుగుతాయి. చింతమడకలో జరిగే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలవాలి. ఇక్కడ ప్రారంభంమైన ఆరోగ్య సూచిక రాష్ట్రంలో త్వరలో మొత్తం జరుగుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాగనే ఆరోగ్య సూచిక దేశనికి ఆదర్శగా నిలుస్తుంది. 40ఏండ్లు దాటినా ప్రతి మహిళ క్యాన్సర్,గుండె జబ్బు టెస్టు చేసుకోవాలి.

అత్యవసరం లాంటి సర్జరీలు ఉంటే సియంతో మాట్లాడి వాటికోసం చర్యలు తీసుకుంటాము. త్వరలో కండ్లు, పళ్లకు ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తాము. మందులు తీసుకున్న ప్రతిఒక్కరు మందులు మంచిగా వాడుకోవాలి. యశోద ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, కేసీఆర్ కిట్ లాంటి మన రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.

ప్రతి ఒక్కరి ఆరోగ్య సూచికతో మరో పథకానికి రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవనుంది. మన సిద్దిపేట నియోజకవర్గం చింతమడక నుండే ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్న" అన్నారు.