శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (14:17 IST)

కేసీఆర్‌కు షాకిచ్చిన నరసింహన్... కొత్త బిల్లుకు బ్రేక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తేరుకోలేనిషాకిచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మున్సిపాలిటీ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. ఈ బిల్లులోని పలు అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ తిప్పిపంపారు. పైగా, ఈ బిల్లును కేంద్రానికి పంపాలని ఆయన నిర్ణయించారు. 
 
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కొత్త మున్సిపాలిటీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ కొత్త మునిసిపల్ బిల్లును గవర్నర్ తిరస్కరించారు. ఈ బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన ఆయన, కొన్ని సవరణలు చేయాలని సూచించారు. 
 
ఈ బిల్లును కేంద్రానికి పంపాలని నిర్ణయిస్తూ, దాన్ని రిజర్వ్ లో ఉంచినట్టు తెలిపారు. కాగా, అసెంబ్లీ ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో గవర్నర్ సూచించిన సవరణలతో ప్రభుత్వం మునిసిపల్ బిల్లుపై ఆర్డినెన్స్ ను జారీ చేయడం ద్వారా కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ముందడుగు వేసింది.