1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Hyderabad: Amitabh Bachchan spotted at Raidurg metro station

హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో తళుక్కుమన్న అమితాబ్

Amitab
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తళుక్కుమన్నారు. తన తదుపరి చిత్రం షూటింగులో భాగంగా ఆయన భాగ్యనగరంలో ఉంటున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం ఆయన రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు. 
 
ట్రైన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ కోసం స్టేషన్‌కు వెళ్లిన ఆయన్ను చూసేందుకు పలువురు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో షేర్‌ చేసిన ఓ నెటిజన్‌.. సాధారణంగా రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో మెట్రో స్టేషన్‌ మొత్తం ఖాళీగా, కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్రబృందంతోనే కనిపించిందని రాసుకొచ్చారు.
 
కాగా, అమితాబ్‌ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నాగ్‌అశ్విన్‌ దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై ఈ సినిమా సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
‘సాలు దొర, సెలవు దొర’...‘సాలు మోదీ, సంపకు మోదీ’... హైదరాబాద్ వేదికగా టీఆర్‌ఎస్, బీజేపీ ప్రకటనల యుద్ధం