ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (13:00 IST)

హైద‌రాబాద్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సలార్ చిత్రం ప్రారంభ‌మైంది

Salar-Prabhas
Salar-Prabhas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా `స‌లార్‌` మంగ‌ళ‌వారంనాడు హైద‌రాబాద్ శివార్లో ప్రారంభ‌మైంది. ప్ర‌భాస్ కెరీర్ 20 ఏళ్ళ సంద‌ర్భంగా ఈ షెడ్యూల్ ప్రారంభించిన‌ట్లు చిత్ర యూనిట్ తెలియ‌జేస్తోంది. పీట‌ర్ హెయిన్స్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ ఆధ్వ‌ర‌ర్యంలో కొని సీన్లు చేస్తున్నారు. కెజి.ఎఫ్‌.2 త‌ర్వాత ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ప్ర‌భాస్ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి.
 
స‌లార్‌లోకూడా భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌రిస్తున్నారు. మ‌రోవైపు ఇంగ్లండ్‌కు చెందిన యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ కూడా ఇందులో పాలుపంచుకోనున్న‌ట్లు స‌మాచారం. స‌లార్‌లో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. శ్రుతిహాస‌న్ హీరోయిన్ న‌టిస్తోంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.
 
కాగా, ఈ సినిమాలో ప్ర‌భాస్‌తోపాటు ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి స‌ప్త‌గిరి ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.