సంబంధిత వార్తలు
- కానిస్టేబుల్ కాదు.. ఆపద్బాంధవుడు... అంబులెన్స్ కోసం పరుగో పరుగు...!
- ముంబైను చితక్కొట్టిన సన్‌రైజర్స్... ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన వార్నర్ సేన
- హైదరాబాదు, మేడ్చల్ ర్వేస్టేషన్‌లో బోగీలకు మంటలు, అప్రమత్తమైన సిబ్బంది
- ప్లే ఆఫ్‌కు చేరాలంటే గెలిచి తీరాల్సిందే.. హైదరాబాద్ ఆఖరి పోరాటం!
- ఏడు వేల వజ్రాలతో చేసిన బ్రహ్మ వజ్ర కమలం వేలం
మహిళతో సహజీవనం... చెప్పినట్టు వినకపోతే నీతో గడిపిన వీడియోలు లీక్ చేస్తా...
హైదరాబాద్ నగరంలో మరో మహిళ ప్రేమ పేరుతో మోసపోయింది. ఒంటరిగా ఉన్న ఈ మహిళపై కన్నేసిన ఓ వ్యక్తి... ప్రేమ, సహజీవనం, పెళ్లి అంటూ మోసం చేశాడు. చివరకు తాను చెప్పినట్టు వినకపోతే... నీతో గడిపిన వీడియోలను లీక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె సైదాబాద్ ప్రాంతంలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన పసుపులేటి అమర్‌నాథ్ అలియాస్ అమర్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తనకు వివాహమైన విషయం చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలాకొంతకాలం ప్రేమ కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇద్దరూ సహజీవనం చేయసాగారు.
పైగా, అతడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేది. ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. అమర్‌కు వివాహం అయిందని, కుమారుడు ఉన్నాడని కొద్ది రోజుల తర్వాత ఆమెకు తెలియడంతో అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. అమర్ చేసిన మోసాలను అతడి కుటుంబసభ్యుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయమని కోరింది. వారు అతడికే వత్తాసు పలికారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా నిందితుడు మాత్రం పత్తాలేకుండా పారిపోయాడు.
తర్వాతి కథనం