గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: మంగళవారం, 3 నవంబరు 2020 (20:53 IST)

హైదరాబాదు, మేడ్చల్ ర్వేస్టేషన్‌లో బోగీలకు మంటలు, అప్రమత్తమైన సిబ్బంది

హైదరాబాదు నగర శివార్లలోని మేడ్చల్ రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. రైల్వేస్టేషన్లో ప్రక్కనే నిలిపి ఉంచిన 10 బోగీలలో 2 బోగీలకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. అంతకంటే ముందుగా ఒక బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపించడంతో అక్కడంతా దట్టమైన పొగ అలుముకుంది. రైల్వే స్టేషన్లోనే ఈ ప్రమాదం జరగడం వలన అక్కడ ప్రయీణికులు, స్థానికులు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు.
 
ఈ అగ్ని ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వీ సీహెచ్ రాకేశ్ మాట్లాడుతూ... రెండు బోగీలకు నిప్పంటుకుందని, మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమైనట్టు తెలిపారు రాకేశ్.