హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఓ ఉంగరంలో అత్యధిక వజ్రాలను పొదిగినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ బ్రహ్మ వజ్ర కమలం ఉంగరాన్ని ఇప్పుడు ఆన్‌లైన్లో వేలం వేయబోతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తను ప్రచురించింది.
సహజమైన 7,801 వజ్రాలను పొదిగి చేసిన ఈ ఉంగరం రిజర్వు ధరను బిడ్డర్ల కోసం 78.01 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. వేలం కోసం ఈ నెల 13 నుంచి 22 వరకు దీన్ని ఆన్‌లైన్లో ప్రదర్శిస్తారు. సోమవారం నుంచి బిడ్డింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
వేలంలో పాల్గొనదలచిన వారు thedivine7801.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వేలంలో పలికిన ధరలో 10 శాతాన్ని పీఎం కేర్ ఫండ్‌కు ఇస్తానని ఆ వ్యాపారి తెలిపారని ఆంధ్రజ్యోతి కథనం వివరించింది.