హనీట్రాప్‌లో నగ్నంగా చాటింగ్.. ఆపై రికార్డింగ్.. ధనవంతులే టార్గెట్..

honey trap
ఠాగూర్| Last Updated: మంగళవారం, 3 నవంబరు 2020 (11:54 IST)
హనీట్రాప్‌లో నగ్నంగా చాటింగ్ చేస్తూ రికార్డింగ్ చేస్తారు. ముఖ్యంగా ధనవంతుల పిల్లలే లక్ష్యంగా ఈ హనీట్రాప్ జరుగుతుంది. ఈ మోసగత్తెల వలలో చిక్కుకున్నారంటే.. ఆ తర్వాత నిద్రలేమి రాత్రులు గడపాల్సిందే. ముఖ్యంగా, హనీట్రాప్‌ పేరుతో అమ్మాయిలు కవ్విస్తూ మాట్లాడుతూ, నగ్నంగా చాటింగ్‌ చేయించి.. బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన భరత్‌పూర్‌ గ్యాంగ్‌ ఇప్పుడు దోపిడీకి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. డేటింగ్‌, పోర్న్‌సైట్స్‌ వీక్షకులను టార్గెట్‌ చేసుకుని నగ్నంగా చాటింగ్‌ చేయించి.. బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. దోపిడీ పర్వాన్ని శ్రీకారం చుట్టింది. ఈ హనీట్రాప్‌లో చిక్కుకున్న బాధితులు కొందరు పరువు పోతుందని మిన్నకుండిపోతుండగా, మరికొందరు మౌఖిక ఫిర్యాదులు చేస్తున్నారు.

భరత్‌పూర్‌ గ్యాంగ్‌ సభ్యులు పోర్న్‌‌సైట్స్‌, డేటింగ్‌ సైట్స్‌లోని ఫోన్‌ నంబర్లను ఎంపిక చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై వారి కాంటాక్ట్‌ లిస్టుల గురించి తెలుసుకుంటున్నారు. దీనికోసం వారు ఫ్రెండ్‌ రిక్వెస్టులను పంపిస్తున్నారు. ఇలా మొదట సాధారణ పరిచయంతో మొదలుపెట్టి.. వలపు వలలో చిక్కేలా చేస్తున్నారు.

తొలుత వాట్సాప్‌ చాటింగ్‌, ఫోన్‌ కాల్స్‌ తర్వాత 'నీకు మంచి అందగత్తెతో పరిచయం చేస్తాం' అని ఆశ పుట్టిస్తారు. అలా మొదలు పెట్టి అమ్మాయి ముఖం కనిపించకుండా మాటలను మాట్లాడిస్తారు. ఆ తర్వాత మెల్లగా ముగ్గులోకి దింపి.. నగ్నంగా ప్రత్యక్షమవుతారు. కానీ అవతలి వైపు యువతి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడుతారు. అలా నగ్నంగా మాటలు కలిపి ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తిని నగ్నంగా రమ్మంటారు.

ఇక్కడ సీన్‌ కట్‌ చేస్తే.. మరుసటి రోజు అమ్మాయితో నగ్నంగా మాట్లాడిన వీడియోను వాట్సాప్‌ ద్వారా సదరు వ్యక్తికి పంపిస్తారు. ఈ వీడియో చూడగానే మాట్లాడిన వ్యక్తి టెన్షన్‌ పడే లోపే.. అతడికి భరత్‌పూర్‌ గ్యాంగ్‌ నుంచి ఫోన్‌ వస్తుంది.

'చూశావా నీ వీడియో ఎంత బాగుందో... క్షణికావేశంలో నీవు ఎలా ప్రవర్తించావో చూసుకున్నావా.? ఇప్పుడు ఈ వీడియో నీ ఫేస్‌బుక్‌ ఖాతాలోని కాంటాక్ట్స్‌... మీ స్నేహితులకు... బంధువులకు పంపిస్తే ఎలా ఉంటుంది.. మీ కుటుంబసభ్యులకు చూపిస్తే ఎలా ఉంటుంది' అని బెదిరిస్తారు.

డబ్బులు ఇవ్వాలని లేకపోతే యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియాలో వీడియోను వైరల్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడి డబ్బులు గుంజుతారు. దాదాపు ఇప్పుడు సైబర్‌ క్రైం ఠాణాల్లో నమోదవుతున్న కేసుల్లో హనీట్రాప్‌లో పడ్డవారిలో అధికంగా సంపన్నులే ఉంటున్నారు. వీరు ఫిర్యాదు ఇవ్వకుండా తమ పరువు, ప్రతిష్టను కాపాడాలని పోలీసులను వేడుకుంటున్నారు.

హైదరాబాద్‌లో పలు కార్పొరేట్‌ సంస్థలకు చెందిన వారితో పాటు చాలా మంది వ్యాపారులు హనీట్రాప్‌కు చిక్కి విలవిలలాడుతున్నారు. కాబట్టి తరచుగా పోర్న్‌‌సైట్స్‌, డేటింగ్‌ సైట్స్‌లలో ఉండే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

నగ్నంగా వీడియో మాట్లాడమంటే అది హనీట్రాప్‌గా భావించాలని హెచ్చరిస్తున్నారు. హనీ ట్రాప్‌లో మీ వీడియో రికార్డు అవుతుంది తప్పా.. ట్రాప్‌ చేసే అమ్మాయి తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతుందని, అందువల్ల యువత ఏమాత్రం ఏమరుపాటుతో ఉండరాదని పోలీసులు సలహా ఇస్తున్నారు.దీనిపై మరింత చదవండి :