1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Hyderabad man raped minor girl

మహిళతో వివాహేతర సంబంధం.. కుమార్తెపై కన్నేశాడు.. ఆపై లైంగిక దాడి

Hyderabad
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కీచకుడు ఆమె మైనర్ కుమార్తెపై కన్నేశాడు. తల్లికి తెలియకుండా మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు నార్సింగిలో ఆటోడ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి స్ధానికంగా ఉన్న మహిళతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈక్రమంలో మైనర్ అయిన ఆమె కూతురిపై కన్నేశాడు.
 
ఇటీవల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈవిషయం బస్తీ వాసులకు తెలిసింది. సమాచారం తెలుసుకున్న చైల్డ్ కేర్ కమిటీ సభ్యులు బస్తీవాసుల సహాయంతో బాలికను కలిసి వివరాలు సేకరించారు. అనంతరం నిందితుడిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తర్వాతి కథనం
ఒన్‌ వాయిస్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ ద్వారా నిధులు- ఏకమైన దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత కమ్యూనిటీ