శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 22 జూన్ 2021 (20:12 IST)

ఒన్‌ వాయిస్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ ద్వారా నిధులు- ఏకమైన దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత కమ్యూనిటీ

అంతర్జాతీయ సంగీత దినోత్సవ వేడుక వారంలో యునైటెడ్‌ సింగర్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌(యుఎస్‌సీటీ)తో భాగస్వామ్యం చేసుకుని దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధమైన సంగీత కళాకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చింది ఫేస్‌బుక్‌. వారి సృజనాత్మకతతో ప్రజలకు వర్చ్వుల్ వినోదం అందిస్తూనే, వారికి స్ఫూర్తిని కలిగించనుంది.

‘ఒన్‌ వాయిస్‌’ శీర్షికన నిర్వహించబోతున్న కాన్సర్ట్‌లో ఈ కళాకారులు తమ ప్రదర్శన అందించనున్నారు. ఇది ఫేస్‌బుక్‌పై నిర్వహిస్తోన్న ‘లైవ్‌ ఇన్‌ యువర్‌ లివింగ్‌ రూమ్‌ కాన్సర్ట్‌’ల సిరీస్‌లో భాగం. జూన్‌ 22 నుంచి జూన్‌ 26వ తేదీ వరకూ జరిగే ఈ కాన్సర్ట్స్‌ ద్వారా అవగాహన మెరుగుపరచడంతో పాటుగా ఇబ్బందులు పడుతున్న సంగీత కళాకారులు, గాయకులకు ఈ కష్టకాలంలో సహాయమందించేందుకు నిధులనూ సమీకరించనున్నారు.
 
ఫేస్‌బుక్‌ వ్యాప్తంగా తమను తాము వ్యక్తీకరించుకునేందుకు, అనుసంధానించబడేందుకు, భావాలను ఇతరులతో పంచుకునేందుకు అత్యంత కీలకమైన తోడ్పాటును సంగీతం అందిస్తుంది. ఫేస్‌బుక్‌ యొక్క ‘సోషల్‌ ఫర్‌ గుడ్‌’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తోన్న ప్రత్యక్ష వినోద కార్యక్రమం ‘లైవ్‌ ఇన్‌ యువర్‌ లివింగ్‌ రూమ్‌’.

ఇది భారీ కమ్యూనిటీ కారణాలకు మద్దతునందించడంతో పాటుగా ప్రజలలో ప్రాచుర్యం పొందిన వ్యక్తులను, సృషికర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి అవగాహన మెరుగుపరచడం నిధులను అందించడం చేస్తుంది. ఈ కాన్సర్ట్‌లో 50 మందికి పైగా కళాకారులు భారత ఉపఖండం నుంచి పాల్గొనడంతో పాటుగా వరుసగా తమ ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా ప్రత్యక్ష ప్రదర్శనలను సైతం నిర్వహిస్తారు. ఈ కాన్సర్ట్‌లో పాల్గొంటున్న సంగీతకారులలో జీవీ ప్రకాష్‌, కార్తీక్‌, రఘు దీక్షిత్‌, సీన్‌ రోల్డన్‌, రాజేష్‌ వైద్య, హరిచరణ్‌, శ్రీనివాస్‌, శ్వేతా మోహన్‌ విజయ్‌ ప్రకాష్‌, ఉన్నికృష్ణన్‌, ఉత్తర వంటి వారెందరో ఉన్నారు.
 
ఫేస్‌బుక్‌ ఇండియా మీడియా పార్టనర్‌షిప్స్‌ డైరెక్టర్‌ పరాస్‌ షరామ్‌ ఈ కాన్సర్ట్‌ గురించి మరింత వివరంగా వెల్లడిస్తూ,‘‘భారతీయ సంగీత పరిశ్రమ నుంచి భాగస్వాములతో మేము కలిసి పనిచేయడం ద్వారా వినూత్నమైన సామాజిక అనుభవాలను నిర్మించడంతో పాటుగా ఫేస్‌బుక్‌పై ప్రజలు కనెక్ట్‌ అయ్యే విధానంతో పాటుగా అద్వితీయ క్షణాలను పంచుకునే విధానంలో కూడా సంగీతాన్ని తీసుకువస్తున్నాం. గత కొద్ది నెలల కాలం ఎంతోమందికి కష్టకాలంగానే ఉంది. కానీ, ఎంతోమంది ప్రజలు మా వేదికలపైకి రావడంతో పాటుగా ఒకరికొకరు సహాయపడుతుండటం చూడటం పట్ల సంతోషంగా ఉంది. ప్రజలు వర్ట్యువల్‌గా ఏకతాటిపైకి వచ్చే అవకాశాన్ని ప్రజల కోసం మేము అందించడంతో పాటుగా సౌకర్యవంతంగా తమ ఇళ్ల నుంచే చిరునవ్వులు చిందించే అవకాశమూ కల్పించాం. ఈ కార్యక్రమం కోసం యునైటెడ్‌ సింగర్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము ఆనందంగా ఉన్నాం’’ అని అన్నారు.
 
యునైటెడ్‌ సింగర్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఫౌండర్‌ ట్రస్టీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘‘ఫేస్‌బుక్‌తో మాభాగస్వామ్యం ఎల్లప్పుడూ విలువైనదే. ఈ అద్భుత కార్యక్రమం జరిగేందుకు ప్రతి ఒక్కరూ చూపిన స్ఫూర్తికి ప్రతిరూపంగా ఒన్‌వాయిస్‌ నిలుస్తుంది మరియు కొవిడ్‌-19తో పోరాడుతున్న సంగీతకారులు, గాయకులకు సహాయపడాలనే తపననూ ప్రతిబింబిస్తుంది. ఈ కాన్సర్ట్‌ను విజయవంతం చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.
 
ఒన్‌ వాయిస్‌ కాన్సర్ట్‌, జూన్‌ 22, మంగళవారం నుంచి జూన్‌ 26, శనివారం వరకూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ యుఎస్‌సీటీ యొక్క ఫేస్‌బుక్‌ పేజీపై మరియు సంబంధిత కళాకారుల ఫేస్‌బుక్‌ పేజీలపై జరుగుతుంది. ఈ వారమంతా కూడా సంగీత ప్రేమికులు తమను తాము అనుసంధానిత రీల్స్‌ ఛాలెంజెస్‌  అయినటువంటి క్రియేటర్‌ వరుణ్‌ రికర్‌ మరియు టీ-సిరీస్‌ అభివృద్ధి చేయగా నూతనంగా ప్రారంభించిన ఏఆర్‌ ఫిల్టర్‌- బీట్‌ డ్యాన్స్‌ మరియు ప్రత్యేక ఎడిషన్‌ మోర్‌ మ్యూజిక్‌ టుగెదర్‌ స్టికర్స్‌ ద్వారా వ్యక్తీకరించుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూడవచ్చు.