మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 మే 2021 (14:02 IST)

వాట్సాప్ సరికొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్‌ను రివ్యూ చూసుకునే ఆప్షన్

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే గత కొద్దిరోజుల క్రితం ప్రైవసీ విషయంలో వాట్సాప్ పై యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో యాజమాన్యం వెనుకడుగు వేసింది. దీనికారణంగా పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్లీ రాబట్టుకోవడానికి వాట్సాప్ న్యూ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. 
 
ఈ క్రమంలో ఇటీవలి కాలంలో పలు అప్‌డేట్లతో సేవలను మెరుగుపరుస్తున్నది వాట్సాప్‌. అందులో భాగంగానే మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. సాధారణంగా మనం వాయిస్ మెసేజ్‌లను పంపే సమయంలో రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉండదు. 
 
వాయిస్ రికార్డ్ చేయగానే ఆటోమెటిగ్‌గా అవతలి వారికి సెండ్ అవుతుంది. అయితే ఇకపై రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌ను రివ్యూ చూసుకునే అవకాశం లభించనుంది. వాట్సాప్ తీసుకురానున్న ఈ కొత్త ఫీచర్‌తో ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ టెస్టింగ్‌లో ఉంది. 
 
ఇక రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌ను వినే వేగాన్ని కూడా యూజర్ ఎంచుకునే అవకాశాన్ని ఈ ఫీచర్ ద్వారా అందించనున్నది. రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్‌ను పంపే సమయంలో రివ్యూ బటన్ ద్వారా దానిని వినే అవకాశం కల్పించనుంది.