శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (15:31 IST)

ఇకపై జియో ఫోన్లలో వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ఫోన్‌ వినియోగదారులకు వాట్సాప్ శుభవార్త చెప్పింది. ఇకపై జియో ఫోన్లలో వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

అంతేకాదు ఇకపై కైయోస్ ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్‌) మొబైల్ వినియోగదారులు కూడా వాయిస్ కాల్స్ మాట్లాడుకునేలా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఎనేబుల్ చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
 
వాట్సాప్‌లోని వాయిస్ కాల్స్ అప్ డేట్ తో తాజా వెర్షన్ 2.2110.41 తో లభిస్తుంది. కొత్తగా తెచ్చిన ఈ ఫీచర్ ను కైయోస్ ఓఎస్ లో వినియోగించుకోవాలంటే 512 ఎంబీ ర్యామ్ తప్పని సరిగా ఉండాలని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు. 
 
ఇప్పటికే ఉన్న కైయోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్ట్ ఉన్న ఫోన్లలో ఈ నోటిఫికేషన్ చూపిస్తుంది. ఒకవేళ కైయోస్ ఓస్ వినియోగదారులు ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.