గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (15:36 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య గర్భవతి.. ఇంతలో భర్త ఏం చేశాడంటే..?

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతితో సంతోషంగా జీవించాలనే ఆశతో వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు బంధువుల ఈటెల్లాంటి మాటలకు మానసికంగా కృంగిపోయి గర్భంతో ఉన్న భార్యను వదిలి ఆత్మహత్య చేసుకుంటూ రాసిన ఓ లేఖ కంటతడి పెట్టిస్తోంది.

ఆ లేఖలో 'నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నిన్ను ఎంతో సంతోషంగా చూసుకోవాలనుకున్నా.. కానీ ఈ సమాజంలో పెళ్లి చేసుకున్నా.. విడదీసి నిన్ను నానుండి దూరం చేసారు.. నీకు దూరంగా నేను జీవించలేను.. నేను మరణించినా నీతోనే ఉంటాను.. మన బిడ్డను నువ్వు కనాలి.. నువ్వే నాకు అంత్యక్రియలు చేయాలి' అంటూ సూసైడ్ నోటులో వుంది. 
 
యూపీలో ఓ యువకుడు ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాడు. తరువాత కూడా ఆ జంట ధువులు.. ఇరుగుపొరుగువారు.. తెలిసినవాళ్లు మాట్లాడే ఈటెల్లాంటి మాటలతో మానసికంగా కృంగిపోయారు. ఈ క్రమంలోనే ఆమె గర్భందాల్చింది. కానీ మతంకాని వ్యక్తిని వివాహం చేసుకుందని యువతి తల్లిదండ్రులు ఆమెను తమతో తీసుకువెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. 
 
ఈ క్రమంలో భార్యకు దూరమైన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య గర్భవతి అని తెలిసి కూడా, పుట్టబోయే బిడ్డను కూడా చూడకుండా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ స్టేషన్‌కు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో దొరికిన సూసైడ్ నోట్ అక్కడున్నవారినే కాదు పోలీసులను కూడా భావోద్వేగానికి గురి చేసింది.