శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (14:43 IST)

ఎక్స్‌పోజింగ్ నా ఇష్టం- అడిగితే ఫైర్ అయిన అన‌సూయ‌

Anasuya
యాంక‌ర్ అన‌సూయ అంద‌రికీ తెలిసిన అమ్మాయే. త‌న అంద‌చంద‌ల‌ను జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్‌లో ప్ర‌ద‌ర్శిస్తుంటుంది. కుర‌చ గౌనులు, తొడ‌లు క‌నిపించేలా, జ‌బ్బ‌లు క‌నిపించేలా, చెస్ట్ కూడా ఇంచుమించు క‌నిపించేలా చేస్తుంది. దీనిపై కామ‌న్ మేన్ కూడా ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూనే వుంటారు. ఇలాంటివి పేరున్న ఛాన‌ల్ యాజ‌మ‌న్యం కూడా ఎంక‌రేజ్ చేస్తుంది. ఇక‌ ఆ కార్య‌క్ర‌మంపై బూతు కామెడీ అనేది కూడా గ‌తంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. దానికి అప్ప‌టిలో నాగ‌బాబు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్ప‌టి సంగ‌తి చూద్దాం. అన‌సూయ ఇంకా యాంక‌ర్‌గానే కొన‌సాగుతుంది. ఆమె వ‌స్త్ర ధార‌ణ‌పై ఇటీవ‌లే చ‌ర్చ‌కు వ‌చ్చింది. దానిని ఏకంగా ఈటీవీలో కూడా ప్రోమో కూడా రిలీజ్ చేశారు.
 
ఏమీ చెప్ప‌లేని ఆది
హైప‌ర్ ఆది పంచ్ డైలాగులకు ఫేమ‌స్‌. ఆయ‌న షోలో వ‌స్తే ఆయ‌న‌తో అన‌సూయ డాన్స్ వేయ‌డానికి ఎగిరి గంతేసి వ‌స్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య వున్న రాపో అలాంటిది మ‌రి. కాగా, రేపు రాబోయే గురువారంనాటి ఎపిసోడ్ ప్రోమోను సోమ‌వారంనాడు టెలికాస్ట్ చేశారు. హైప‌ర్ ఆది ఓ వ్య‌క్తిని స్టేజీ మీద‌కు తెచ్చాడు. వారితోపాటు అన‌సూయ కూడా వుంది. ఆ వ్య‌క్తి మిమ్మ‌ల్ని ఒక‌టి అడ‌గాల‌నుకుంటున్నా అంటాడు. చెప్పండి అంటుంది. మీరు కుర‌చ గౌనులు ఎందుకు వేసుకుంటారు? అంటూ ప్ర‌శ్న వేస్తాడు. ఇదిసినిమా ఫీల్డ్ మీకు తెలియంది ఏముంది. మీరు కూడా అలా అడుగకూడ‌దు. అని జ‌వాబు చెబుతూ. ఇది నా ఇష్టం అండి. అంటుంది.

నోరు వెళ్ళ‌బెట్టిన రోజా
మీ ఇష్టం అయితే మీరు ఇంటిలో వేసుకోండి. అంటూ వెంట‌నే బ‌దులిస్తాడు ఆవ్య‌క్తి.. ఆ ప్ర‌శ్న‌కు అన‌సూయ ఫైర్ అయింది. ఎవరిని ప‌డితే వారిని తీసుకొస్తారు స్టేజీ మీద‌కు అంటూ.. ఆది వంక తీక్ష‌నంగా చూసి కోపంగా బ‌య‌ట‌కు వెళ్ళిపోతుంది. ఇది హ‌ఠాత్ ప‌రిణామ‌మైనా కామ‌న్‌మేన్ వాయిస్ ఆ వ్య‌క్తి నుంచి వ‌చ్చింది.ఆమె అలా వెళుతుంటే జ‌డ్జి రోజా నోరు వెళ్ళ‌బెడుతుంది. మ‌నో కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తాడు. బ‌హుశా ఇది కేవ‌లం ఈటీవీ ఎట్రాక్ష‌న్ కోసం చేసిందా.. దాని త‌ర్వాత ఇంకేమైనా వుందా? అనేది తెలియాల్సి వుంది.