గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (13:13 IST)

అవికా గోర్ అతనితో అఫైర్‌ కారణంగా బిడ్డను కన్నదట! నిజమేనా?

అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలికా వధు సీరియల్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన అవికా.. ఇటు చిన్నారి పెళ్లి కూతురుగా తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. ఆ తర్వాత మనీశ్‌ రాయ్‌సింఘన్ అనే నటుడితో కలిసి ససురాల్‌ సిమర్ కా అనే మరో హిందీ సీరియల్ నటించింది అవికా. ఈ సీరియల్ బాగా హిట్ అయ్యింది. 
 
ఈ సీరియల్ చేసే సమయంలో మనీశ్‌ రాయ్‌సింఘన్‌తో అవికా అఫైర్ పెట్టుకుందని.. అతడితో బిడ్డను కూడా కందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై తాజాగా గుట్టు విప్పింది అవికా. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. మనీశ్‌కు, మీకు మధ్య ఎఫైర్ ఉందనే గుసగుస నిజమేనా? అని ప్రశ్నించారు.
 
ఇందుకు అవికా.. `అది ఏ మాత్రం నిజం కాదు. మనీశ్‌తో ఓ బిడ్డను కన్నాననే కథనాలు నేను చదివా. కానీ, ఇది పుకారు మాత్రమే. మనీశ్‌ నాకు మంచి సన్నిహితుడు. అతడి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. 
 
వయసులో నాకంటే మనీశ్‌ 18 సంవత్సరాలు పెద్ద. మా మధ్య ఏమైనా జరిగిందేమోనని ఇప్పటికీ నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఏం చెప్పను? అతను మా నాన్న కంటే కొంచెం చిన్నోడంతే! దాదాపుగా మా నాన్న వయసు` అని సమాధానం ఇచ్చింది.