గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (17:16 IST)

'అమరన్‌ ' ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' ప్రారంభం

Amaran movie clap
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఆదిసాయికుమార్ హీరోగా అవికాగోర్ హీరోయిన్ గా ఎస్‌.వీ.ఆర్‌ ప్రొడక్షన్స్ ప్రై.లి బ్యానర్ చిత్రం 'అమరన్‌ ' ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1'  ప్రారంభమైంది. ఈ సినిమా శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్‌.బల‌వీర్‌ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌.వీ.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్ట‌గా జెమినీ మూర్తి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీర‌భ‌ద్రం చౌద‌రి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  
ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఇన్నోవేటివ్‌, యూనిక్‌ పాయింట్‌తో 'అమరన్‌ ' ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' సినిమా రూపొందుతుంది. 
 
Amran team
గత చిత్రాల కంటే ఆది సాయికుమార్‌ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ పాత్రలో కామిక్‌ టచ్‌ కూడా ఉంటుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ భారీ బ‌డ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత‌లు. అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా చేయ‌బోతున్న  ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై మేకర్స్‌ రెండేళ్లు పాటు శ్రమించారు. ప్రేక్షకకులను ఆలోచింప‌జేసే కథాంశంతో థ్రిల్లర్‌, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. 
 
ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర్‌ శంకర్‌, పవిత్రా లోకేశ్‌, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీత సారథ్యం వహిస్తుండగా శాటి.ఎం సినిమాటోగ్రఫీ, నిర్మాత:  ఎస్‌.వీ.ఆర్, లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్వేతా కటకం.