బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (15:43 IST)

ఆర్‌.ఆర్‌.ఆర్‌. షూటింగ్ కు ఈరోజే జాయిన్ అయిన రామ్‌చ‌ర‌ణ్‌

charan -alia
రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నాడు. ఈ షూటింగ్ క‌రోనావ‌ల్ల వాయిదా ప‌డింది. ఇప్ప‌డిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి. అన్ని సినిమాల షూటింగ్ ప్రారంభ‌మ‌య్యాయి. అందులో భాగంగా ఆర్‌.ఆర్‌.ఆర్‌. షూటింగ్ కూడా హైద‌రాబాద్ శివార్లో ప్రారంభ‌మైంది. సోమ‌వారంనాడు తాను షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్లు రామ్‌చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆయ‌న‌తోపాటు ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా సెట్స్ కి వచ్చాడు. ఈ షెడ్యూల్ లో చ‌ర‌ణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఫొటోను కూడా చ‌ర‌ణ్ పోస్ట్ చేశాడు.
 
charan-Hakeem
మ‌రో పోస్ట్‌లో ఈరోజే సెట్‌కు వెళుతున్నానంటూ, అలియాభ‌ట్ జులైలో రానుందంటూ ఇద్ద‌రూ క‌లిసిన స్టిల్ ఆయ‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ అయింది. ఇక కొమ‌రంభీమ్‌గా న‌టిస్తున్న ఎన్‌.టి.ఆర్‌. కూడా మంగ‌ళ‌వారం నుంచి జాయిన్ అవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వీరిద్దరిపై యాక్ష‌న్ పార్ట్‌, ఓ సాంగ్‌కూడా తీసిన్ట‌లు వాటికి సంబంధించిన స్టిల్స్ కూడా విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్ తాజాగా మ‌రోసారి ఆ ఇద్ద‌రిపై ఓ ప్ర‌త్యేక సాంగ్‌ను కూడా చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌గా సినిమా పూర్తి చేసుకుని కొత్త విడుదల తేదీని ప్రకటించడానికి చిత్ర యూనిట్‌ ప్రయత్నిస్తున్నారు.