ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (13:41 IST)

జ‌న‌ర‌ల్ నాలెడ్జీలేని న‌టీమ‌ణులతో యాంక‌ర్ ప్ర‌దీప్ ఆడుకుంటే వివాద‌మైంది

Paadeep
నిన్న ఆదివారంనాడు ఓ టీవీ ఛాన‌ల్ త‌న ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే సీరియ‌ల్స్‌లోని న‌టీన‌టుల‌తో ఓ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది. ఆ టీవీలోని న‌టులంతా ప‌క్క రాష్ట్రంలోని వారే. తెలుగు రాష్ట్రంలో వున్న న‌టీన‌టులు ఎవ‌రైనా వున్నారంటే వేళ్ళ‌మీద లెక్కించుకోవాల్సిందే. ఎందుకంటే ఆ సీరియ‌ల్‌లో కీల‌క‌మైన పాత్ర‌లు పోషించేవారంతా క‌న్న‌డిగులే. తెలుగు నేర్చుకుని మ‌రీ సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్నారు. ఇక ఆ ఛాన‌ల్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అస‌లు విస‌యంలోకి వెళితే. ఆ ఛాన‌ల్‌లో జ‌రిగిన వేడుక‌కు యాంక‌ర్‌గా ప్ర‌దీప్ వ్య‌వ‌హ‌రించాడు. అందులో ఒక్కో టీమ్ నుంచి కొంత‌మందిని ఎంపిక‌చేసి వారిని ప్ర‌శ్న‌లు అడిగితే వారు అంతే ఇదిగా స‌మాధానం చెప్పారు.
 
ప్ర‌దీప్ ఓ న‌టిని సీరియ‌ల్స్ గురించి అడుగుతూనే, అమ‌రావ‌తి రాజ‌ధాని ఏది? అని అడిగాడు. వెంట‌నే ఆమె వైజాగ్ అని చెప్పింది. ఈ స‌మాధానంపై  తెల్లారేస‌రికి ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి ప్ర‌దీప్‌పై తీవ్రంగా మండిపడింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యలు చేశారంటూ, వాటిని సరిదిద్దుకోవాలని అంతేకాకుండా క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇలా వుండ‌గా, ప్ర‌దీప్ మ‌రో న‌టిని ఎస్‌.ఎస్‌.సి. అంటే ఏమిటో తెలుసా? అని అడిగాడు. త‌న‌దైన శైవిలో సీరియ్స‌ల్ గురించి సూప‌ర్‌సీరియ‌ల్స్‌లీగ్ అంటూ ఆ ఛాన‌ల్‌ను పొగిడింది. మ‌రి టెన్త్ క్లాస్‌ను ఏమంటారో తెలుసా? అని ప్ర‌దీప్ ఆమెను తిరిగి అడిగాడు.. దానిని ఎస్‌.ఎల్‌.సి. అంటూ చెప్పింది. హో.. ఈమె నిజంగా సూప‌ర్‌బ్రెయిన్ అంటూ సెటైర్ వేశాడు. ఎందుకంటే ఆమె చేస్తున్న సీరియ‌ల్‌లో ఇంట్లోవారికి తెలీకుండా ఎ.ఎ.ఎస్. రాసి పాస్ అవుతుంది. ఇలా ప‌లు ర‌కాలుగా న‌టీమ‌ణుల‌తోనూ న‌టుల‌తో ప్ర‌దీప్ ఆడుకున్నాడు. 
 
ఫైన‌ల్ గా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారంతా మా సీరియ‌ల్ గొప్ప అంటే మా సీరియ‌ల్ గొప్ప అనేలా టైటిల్‌కు స‌రిప‌డా కామెంట్స‌ను చేసి ఛాన‌ల్ ప్ర‌తినిథిని ఇంప్రెస్ చేశారు. దీనికి ప‌రాకాష్ట్ర ఏమంటే.. ఇంత‌కుముందు ఈటీవీలో ఒక వెలుగు వెలిగిన న‌టుడు ఈ ఛాన‌ల్‌లో ఓ సీరియ‌ల్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆయ‌న వంతు వ‌చ్చిన‌ప్పుడు ఈ ఛాన‌ల్లో ఇలా వందేళ్ళు వుండాల‌నుకుంటున్నానంటూ ఎగ్జ‌యిట్‌మెంట్‌తో చెప్పాడు. మ‌రీ వందేళ్ళా! అంటూ చూసేవారి ఆశ్చ‌ర్యం క‌లిగింది. ఇలా ప్ర‌తి న‌టీన‌టులు ఆ ఛాన‌ల్ ప్ర‌తినిధిని కొండెక్కించేశారు. ఎందుకంటే ఆమెది కూడా ప‌క్క రాష్ట్రం అట‌. ఆమెకు తీలీకుండా ఓన‌టీకానీ, న‌లుడుకానీ సీరియ‌ల్‌లో న‌టించ‌ర‌ని టాక్ ఎప్ప‌టినుంచో వుంది.