సంబంధిత వార్తలు
- ఎస్... అమెరికాలో ఎక్కడైనా బాంబు వేయగలం... కిమ్: ఉలిక్కిపడిన అమెరికా, జపాన్
- ఈ 'కత్తి'కి ఏమైంది? 'సత్తు' కత్తి అవుతుందా? లేక 'మొద్దు'కత్తి అవుతోందా?
- మహిళలు ఎవరితో బెడ్ షేర్ చేసుకుంటారో వారిష్టం.. బలవంతం కూడదు: ఆండ్రియా
- వదినమ్మా మళ్లీ పెళ్లి కావాలా? అయితే, 'పీకే సార్'ను చేసుకోండి : ఫ్యాన్స్ సలహా
- రైళ్లలో ప్రయాణిస్తున్నారా? ఇకపై ఓ గంట తక్కువ పడుకోవాల్సి ఉంటుంది!
మొదటిరోజే హైదరాబాద్ మెట్రో రైల్లో ఫైన్లతో బాదుడే బాదుడు...
రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు లేనివారు, తెలియకుండా రిజర్వుడు బోగీలో ఎక్కేవారికి టికెట్ ఇన్‌స్పెక్టర్లు ఫైన్లు వేస్తుంటారు. ఇది మనకు తెలిసిందే. ఐతే బుధవారం నాడు తెలంగాణలో ప్రారంభమైన మెట్రో రైలులో ప్రయాణికులకు అయోమయ పరిస్థితి ఎదురైంది. రైలెక్కి దిగగానే
రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు లేనివారు, తెలియకుండా రిజర్వుడు బోగీలో ఎక్కేవారికి టికెట్ ఇన్‌స్పెక్టర్లు ఫైన్లు వేస్తుంటారు. ఇది మనకు తెలిసిందే. ఐతే బుధవారం నాడు తెలంగాణలో ప్రారంభమైన మెట్రో రైలులో ప్రయాణికులకు అయోమయ పరిస్థితి ఎదురైంది. రైలెక్కి దిగగానే ఎదురుగా ఫైన్ కట్టు అంటూ టికెట్ కలెక్టర్స్ ప్రత్యక్షమవడంతో షాక్ తిన్నారు.
ఇలా ఎందుకు జరిగిందయా అంటే... మెట్రో రైల్లో నాగోల్ లేదంటే ఉప్పల్ నుంచి మియాపూర్ వెళ్లాలనుకునేవారు అమీర్ పేటకు వెళ్లి అక్కడి నుంచి మరో ట్రైన్లో ఎక్కాలి. ఒకవేళ ఉప్పల్ నుంచి మియాపూర్ వరకూ ఒకటే టిక్కెట్ తీసుకున్నప్పటికీ అమీర్ పేటలో దాన్ని మార్చుకుని వెళ్లాలి. ఇది తెలియక చాలామంది అలాగే రైల్లో ఎక్కేశారు. ఇంకేముంది... వారు మియాపూర్లో దిగగానే ఫైన్లతో అధికారులు బెంబేలెత్తించారు. ఈ పరిస్థితిని త్వరలో చక్కదిద్దుతామని రైల్వే అధికారులు వెల్లడించారు.
తర్వాతి కథనం