శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2017 (11:02 IST)

వదినమ్మా మళ్లీ పెళ్లి కావాలా? అయితే, 'పీకే సార్‌'ను చేసుకోండి : ఫ్యాన్స్ సలహా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మాజీ భార్యపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒంటరి జీవితం గడపలేక పోతున్నానని, అందుకే తన మదిలో మళ్లీ పెళ్లి అనే ఆలోచన మొదలైందని పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల వ్యాఖ్యానించిన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మాజీ భార్యపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒంటరి జీవితం గడపలేక పోతున్నానని, అందుకే తన మదిలో మళ్లీ పెళ్లి అనే ఆలోచన మొదలైందని పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
 
పవన్ ఫ్యాన్స్ పెట్టిన 'హేట్ మెసేజ్'లపై రేణు సైతం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. స్త్రీ, పురుష సమానత్వం ఎక్కడుందని, మగవాళ్లు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చా? అని అడుగుతూ రేణు తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టు వైరల్ కాగా, పలువురు ఆమె నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఓ అభిమాని అయితే మరో అడుగు ముందుకు వేసి, మళ్లీ పెళ్లి కావాలంటే 'పీకే (పవన్ కల్యాణ్) సార్' నే చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అదే జరిగితే అత్యధికంగా ఆనందించేది తామేనని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ రేణును తిరిగి తీసుకురావాలని కూడా సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది.