సంబంధిత వార్తలు
- సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు.. భూమా అఖిలప్రియ అరెస్ట్?
- భార్యను చంపి.. మూటగట్టి పడేసిన కసాయి భర్త!
- తమిళ అర్జున్ రెడ్డి హీరోయిన్‌కు కరోనా పాజిటివ్.. ఆస్పత్రికి వెళ్ళనని మొండికేసింది.. చివరికి?
- ఎల్ఈడీ బల్బును మింగేసిన బాలుడు.. వైద్యులు ఎలా వెలికి తీశారంటే?
- పుత్రికోత్సాహంలో తండ్రులు, లోక్‌సభ స్పీకర్ కుమార్తె ఐఏఎస్, పోలీసు కుమార్తె ఐపీఎస్
అపార్ట్‌మెంట్‌లో అమ్మాయిలతో వ్యభిచారం... ఎక్కడ?
హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఓ బహుళ అంతస్తుభవనంలోన ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తూ వచ్చిన వ్యభిచార దందాను పోలీసులు బహిర్గతం చేశారు. ఆ సమయంలో వ్యభిచారం రొంపిలో ఉన్న అమ్మాయిలతో పాటు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్‌టౌన్ కాలనీ తిరుమల అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే రామ తులసి (50), మూసారాంభాగ్‌కు చెందిన ఉమారాణి (39)తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, యువతలను అపార్ట్‌మెంట్‌కు తీసుకువచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి చంద్రపురి కాలనీకి చెందిన మహిళ (43), మన్సురాబాద్‌లో నివాసం ఉండే ప్రశాంత్‌కుమార్ (26)ను అరెస్టు చేశారు. అలాగే అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మరో మహిళను సైతం అరెస్టు చేశారు.
వీరివద్ద నుంచి ఐదు ఫోన్లు, రూ.3 వేల నగదు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళలతో పాటు యువకుడిని అరెస్ట్ చేసి, బుధవారం రిమాండ్‌కు తరలించారు.
