మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (13:29 IST)

ఫ్రీ వాయిస్ కాల్స్.. జియో ప్లాన్స్‌లో మార్పు.. బెనిఫిట్స్ ఇవే..?

2021 జనవరి 1 డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం అని రిలయెన్స్ జియో ప్రకటించింది. ఫ్రీ వాయిస్ కాల్స్ అమలు చేస్తోంది. దీంతో రిలయెన్స్ జియోకు చెందిన పలు ప్లాన్స్‌లో మార్పులు వచ్చాయి. దాదాపు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని సవరించింది జియో. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తోంది. కాంప్లిమెంటరీ డేటా కూడా అందిస్తోంది. అంటే ఇప్పటికే ఐయూసీ ఛార్జీలు వసూలు చేసిన ప్లాన్స్‌పై ఈ ఛార్జీలకు బదులు అదనంగా కస్టమర్లకు డేటా అందిస్తోంది. 
 
ఇక నెల రోజుల ప్లాన్ అంటే 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఎంత రీఛార్జ్ చేయాలి, ఆ ప్లాన్లపై వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.. 
 
రిలయెన్స్ జియో రూ.129 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. ఈ ప్లాన్‌పై 2జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. అంటే 28 రోజులకు 2జీబీ డేటా మాత్రమే ఉపయోగించుకోగలరు.
 
రిలయెన్స్ జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 1.5 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీగా సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
 
రిలయెన్స్ జియో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 2 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం 56 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీగా సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇలాగే రిలయెన్స్ జియో రూ.349 ప్లాన్, రూ.401 ప్లాన్ రీఛార్జ్ ప్లాన్స్‌లోనూ బెనిఫిట్స్ మారాయని జియో ప్రకటించింది.