1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. IMD forecasts rains over northern Telangana districts for 3 days

రేపటి నుంచి ఉరుములు - మెరుపులతో భారీ వర్షాలు.. ఎక్కడ?

rain
తెలంగాణాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భాను తన ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ ధాటికి జనాలు బయటకు ఎక్కువగా రావడంలేదు. గత యేడాది కంటే ఈ దఫా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వేసవి ఎండలతో మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. 
 
రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తాయని, వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న సూచించారు. 15వ తేదీ మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని, ఈదురు గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఉంచనా వేశారు. 
 
16, 17 తేదీల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల కామారెడ్డి ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉందన్నారు. 17వ మాత్రం ముందుగా చెప్పుకున్న ప్రాంతాలతో పాటు పెద్దపల్లి, కరీంనగర్‌లలో కూడా వర్షాలు మరింత భారీగా కురుస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల గాలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఖమ్మం: వీధి కుక్కల దాడిలో మరో బాలుడి మృతి