ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (08:42 IST)

గురుగ్రామ్‌లో ఎనిమిదో తరగతి బాలిక కిడ్నాప్ - సామూహిక అత్యాచారం..

rape
గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఎనిమిదో తరగతి బాలికను ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు కామాంధుల్లో ఇద్దరు అదే మరో పాఠశాలకు చెందిన 11, 12 తరగతులు చదువుతూ మధ్యలోనే ఆపేసిన విద్యార్థులుగా గుర్తించారు.
 
పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి కొండ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన గత యేడాది డిసెంబరు 18వ తేదీన జరిగింది. ఈ విషయాన్ని ఆ బాలిక బహిర్గతం చేయలేదు. ఈ క్రమంలో అత్యాచార సమయంలో తీసిన వీడియోను కామాంధులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరిపై ఫోక్సోతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.