1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (08:32 IST)

స్నేహితుడిని చూసేందుకు వచ్చి పాడుపని చేసిన వ్యక్తికి దేహశుద్ధి

video
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో పాడుపనికి పాల్పడ్డాడు. దీంతో అతనికి దేహశుద్ధి చేశారు. రోగి సహాయకురాలు స్నానం చేస్తుండగా, వీడియో తీశాడు. దీన్ని గమనించిన బాధితురాలు కేకలు వేయడంత నిందితుడిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఆస్పత్రిలో జరిగింది. 
 
ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని చూసేందుకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వకు చెందిన ఏలియా అనే వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో రోగి సహాయకురాలు స్నానం చేస్తుండటాన్ని గమనించిన ఏలియా.. గోడెక్కి వీడియో తీశాడు. దీన్ని బాధితురాలు గమనించి, పెద్దగా కేకలు వేసింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఏలియాను పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.