సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మార్చి 2023 (15:34 IST)

హోలీ వేడుకల్లో యువతిపై వేధింపులు.. చెంప ఛెల్లుమనిపించి.. (video)

holi
ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో ఓ యువతి పట్ల కొందరు యువకులు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జపాన్‌కు చెందిన ఓ యువతిని చుట్టుముట్టిన యువకులు వేధింపులకు గురిచేశారు. ఆమెను గట్టిగా పట్టుకుని రంగులు పూశారు ఓ అబ్బాయి ఆమె తలపై గుడ్డును పగులకొట్టారు. 
 
వారిని వదిలించుకుందామని ఆమె ప్రయత్నించినప్పటికీ ఒకరి తర్వాత ఒకరు, మరొకరు హోలీ.. హోలీ అంటూ అరుస్తూ బలవంతంగా ఆమెపై రంగులు చల్లారు. 
 
ఇలా యువకులు ఆమెను చుట్టుముట్టి రంగులు పూశారు. అయితే ఓ యువకుడి చెంప ఛెల్లుమనిపించి.. అక్కడ నుంచి బయటపడింది. జపాన్‌కు చెందిన ఓ మహిళపై వేధింపులు, అకృత్యాలకు పాల్పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.