ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (16:48 IST)

హోలీ-కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా హల్దీ ఫోటోలు వైరల్

Sidharth Malhotra, Kiara Advani
Sidharth Malhotra, Kiara Advani
హోలీ పండుగను పురస్కరించుకుని కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు గత నెలలో జరిగిన తమ హల్దీ వేడుక ఫోటోలను పంచుకున్నారు. ఈ జంట ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లో వివాహం చేసుకున్నారు. హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కలర్‌ఫుల్ ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలకు, "నా నుండి అందరికీ ప్రేమతో హోలీ శుభాకాంక్షలు..." అని శీర్షిక పెట్టారు.
 
ఈ ఫోటోల్లో కియారా- సిద్ధార్థ్ ఆరెంజ్ దుస్తులలో కనిపిస్తున్నారు. కియారా మెడలో బంగారు ఎంబ్రాయిడరీ ఉన్న నారింజ రంగు కుర్తా, పూల ఆభరణాలు ధరించి ఉంది. సిద్ధార్థ్ ప్రకాశవంతమైన పింక్ నెక్‌లైన్‌తో పసుపు-నారింజ రంగు కుర్తా ధరించాడు.
 
ఎర్రటి సోఫాలో, చుట్టూ పసుపురంగు పూలతో కూర్చున్న ఇద్దరూ ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఒక ఫోటో కూడా సిద్ధార్థ్ తన మెహందీని ప్రదర్శిస్తున్నట్లు చూపిస్తుంది. అతని అరచేతిపై వ్రాసిన కియా అనే పదం కనిపిస్తుంది. 
Sidharth Malhotra, Kiara Advani
Sidharth Malhotra, Kiara Advani
 
ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సెలెబ్రిటీలు కూడా వీరు ఫోటోలకు ఫిదా అవుతున్నారు. అంతేగాకుండా పెళ్లై సరిగ్గా నెల కావడంతో ఇప్పుడిలా జీవితాంతం సంతోషంగా వుండాలని పలువులు సెలెబ్రిటీలు ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.  

Sidharth Malhotra, Kiara Advani
Sidharth Malhotra, Kiara Advani